సౌత్ అమెరికా దేశమైన పెరూ(Peru)లో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణీలతో వెళుతున్న ఓ బస్సు(bus) ప్రమాదవశాత్తూ అదుపుతప్పి 200 మీటర్ల లోతు ఉన్న ఒక లోయ (valley)లో పడిపోయింది.
Peru: సౌత్ అమెరికా దేశమైన పెరూ(Peru)లో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణీలతో వెళుతున్న ఓ బస్సు(bus) ప్రమాదవశాత్తూ అదుపుతప్పి 200 మీటర్ల లోతు ఉన్న ఒక లోయ (valley)లో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని 24 మంది ప్రయాణికులు (24 passengers) దుర్మరణం పాలయ్యారు.
బస్పు ప్రమాద మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ బస్సు ప్రమాదంలో మరో 35 మందికి తీవ్రంగా గాయలవ్వగా.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
హుయాన్యాయో నుంచి హువాంటాకు వెళుతున్న బస్సు .. అదుపుతప్పి ఆండెస్ పర్వతాల వద్దగల లోయలో పడిపోయింది. తక్షణ సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు.. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
మృతులను, క్షతగాత్రులను అంబులెన్స్‌లోకి తరలించి సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆగస్ట్ నెలలో ఇదే ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అప్పుడు జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది ప్రయాణీకులు(13 passengers) మృతి చెందినట్లు తెలిపారు. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం జరగడంతో దానిని డేంజర్ జోన్‌ను ప్రకటించిన అధికారులు.. ఇకపై ప్రమాదాలు జరుగకుండా తక్షణ చర్యలు చేపడుతున్నారు.