ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ గతంలో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును.. ఇస్లామాబాద్ హైకోర్టు (Islamabad High Court) నిలిపివేసింది.
Imran Khan : పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చైర్మన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు భారీ ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ గతంలో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును.. ఇస్లామాబాద్ హైకోర్టు (Islamabad High Court) నిలిపివేసింది.
తోషాఖానా అవినీతి కేసు (Toshakana corruption case)లో తనకు పడ్డ మూడేళ్లు జైలుశిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం రోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై మంగళవారం ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
ఇమ్రాన్ ఖాన్‌ను తోషాఖానా అవినీతి కేసులో ఆగస్టు 5న దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు.. మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఇమ్రాన్ పంజాబ్ ప్రావిన్సులో ఉన్న అటాక్ జైలు (Attock Jail )లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజా తీర్పుతో ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించినట్లయింది.