China Covid Deaths: చైనాలో కరోనా విలయ తాండవం..60 వేల మంది మృతి
China Covid Deaths: డ్రాగన్ దేశంలో కరోనా మరణ మృదంగం మోగుతోంది. రెండేళ్ల తరువాత చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం ఇదే దేశంలో మొట్టమొదటగా మహమ్మారి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టింది. అక్కడ మొదలైన ఆ వైరస్ ఆగడాలు విశ్వ వ్యాప్తమయ్యాయి. గత నెల రోజుల్లో చైనాలో కోవిడ్ సంబంధిత మరణాలు దాదాపు 60వేలు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.
చైనా లో రోజురోజుకూ పెరుగుతున్నాయనే వార్తలు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. డిసెంబరు 8 నుండి జనవరి 12వరకు మధ్య కాలంలో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. చైనాలో కరోనా మృతులతో శ్మశాన వాటికలు నిండిపోతున్నట్టు చెబుతున్నారు. అలాగే ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉందని చెబుతున్నారు. గతంలో కూడా చైనాలో ఇలాంటి పరిస్థితులే… ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. కోవిడ్‌తో మరణించిన వారి సగటు వయసు 80ఏళ్ళుగా వుందని నేషనల్ హెల్త్ కమిషన్‌బ్యూరో ఆఫ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ అధిపతి జియావో యాహుయ్ ఈ మేరకు విలేకరుల సమావేశంలో వాస్తవిక గణాంకాలను విడుదల చేశారు.
వైరస్ కారణంగా నేరుగా శ్వాసకోశ వైఫల్యం వల్ల సంభవించిన 5,503 మరణాలతోపాటు, కోవిడ్‌తో కలిపి అంతర్లీన వ్యాధుల వల్ల 54,435 మరణాలు సంభవించాయని చెప్పారు. కరోనా వైరస్‌తో శ్వాసకోశ వ్యవస్థ విఫలమై మరణించిన వారు 5,503మంది వుండగా, వైరస్‌తో ఇతర అనారోగ్య సమస్యలు కూడా కలిసి మృతి చెందిన వారు 59,938 మంది చనిపోయారని జియావో తెలిపింది. చైనాలో కోవిడ్ మరణాలపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చైనా ఈ నివేదిక జారీ చేసింది. చైనాలో 60 ఏళ్లు పైబడిన లక్షలాది మందికి టీకాలు వేయలేదని తెలిసింది.. వారికీ వెంటనే టీకాలు వేసే పనిలో వైద్య సిబ్బంది నిమగ్నులయ్యారని తెలిపారు.