Boat Accident: ఘోర పడవ ప్రమాదం.. 145 మంది జలసమాధి?
145 people Died: డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ఒక ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కాంగో దేశంలోని లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రయాణికులు బోటు ఒక్కసారిగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 145 మంది జలసమాధి అవగా మరో 55 మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. లులోంగా నదిలో మోటారు బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నిజానికి ఈ మధ్యనే కాంగోలో తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోగా ఆ విషాదం మరువక ముందే మోటార్ బోటులో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా.. బసన్‌కుసు పట్టణం సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఇక పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం.. వస్తువులు, పశువులు కూడా ఉండటంతో అధిక బరువుతో పడవ నదిలో మునిగి పోయిందని, ఆ సమయంలో ఈత రాని వారు నీటిలో మునిగి అక్కడిక్కడే మరణించారని అంటున్నారు. కాంగోలో అధిక సంఖ్యంలో రోడ్లు లేకపోవడంతో.. జనాలు పడవల్లో ప్రయాణిస్తున్నారని, అక్కడి ప్రజలు జీవనోపాధి కోసం నిత్యం ఇలానే ఇతర ప్రాంతాలకు వెళుతుంటారని అంటున్నారు. 2022 అక్టోబర్‌లో కాంగో నదిలో ఇలాంటి ఘటనే జరిగగగా అప్పుడు 40 మంది చనిపోయారు.