YS Sharmila: మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు గుర్తుకొచ్చాయా?..షర్మిల
YS Sharmila: దేశ రాజధాని జంతర్ మంతర్ దగ్గర ఒక్క రోజు దీక్షకు దిగుతున్నారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ పై ఈ నెల 10న దీక్ష చేపట్టనున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లును సభలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు వేశారు. రెండు సార్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి, కవితకు మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? అని ప్రశ్నించారు.
కవిత నిరాహారదీక్ష చేస్తానని చెప్పడం బంగారం పోయిందంటూ దొంగలే పిర్యాదు చేసినట్టు ఉంటుందని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిజాలు బయటపడతాయని కవిత భయపడుతున్నారని అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మహిళా రిజర్వేషన్లు అంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో మహిళలకు బిఆర్ఎస్ పార్టీ కేవలం రెండు సీట్లను మాత్రమే కేటాయించిందని గుర్తు చేశారు. 2018 ఎన్నికల తర్వాత కేబినెట్ లోకి కేవలం ఇద్దరు మహిళలను మాత్రమే తీసుకున్నారని విమర్శించారు. శాసనమండలిలో 34 సీట్లకు మహిళలకు మూడు సీట్లు.. ఇదేనా మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి? 17 పార్లమెంట్ స్థానాలకు మహిళలకు రెండు సీట్లు తొలి క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదు ఇప్పుడున్న క్యాబినెట్ లో పట్టుమని ఇద్దరు మంత్రులు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో మీ తండ్రి గారికి వచ్చిన అడ్డంకి ఏంటి? మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందుఅని సెటైర్లు వేశారు