YS Sharmila: కవిత దీక్ష చేయాల్సింది కేసీఆర్ ఇంటి ముందు: వైఎస్ షర్మిల
YS Sharmila made hot comments on Kavitha’s Deeksha
మహిళా బిల్లులపై దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ కవితపై షర్మిల ఫైర్ అయ్యారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని..కేసీఆర్ ఇంటి ముందని షర్మిల అన్నారు. BRS పార్టీలోనే 33% రిజర్వేషన్ పాటించడం లేదని షర్మిల గుర్తుచేశారు. లిక్కర్ స్కామ్‌లో కవిత ఇరుక్కున్న తర్వాతే మహిళా రిజర్వేషన్ గుర్తొచ్చిందంటూ విమర్శించారు.
కొన్ని రోజుల క్రితం మహిళా దినోత్సవం సందర్భంగా కూడా షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మెడికో ప్రీతి మరణం నేపథ్యంలో షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో కేవలం కవితకు మాత్రమే రక్షణ ఉందని, మిగతా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలనే అత్యాచారాలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు.
కాళేశ్వరంలో షర్మిల పోరాటం
గత కొన్ని నెలలుగా వైఎస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అవినీతిపై పోరాటం చేస్తున్నారు. తాము చేసిన ఫిర్యాదులకు కాగ్ స్పందించిందని షర్మిల తెలిపారు. ఈ నెల 11న కాళేశ్వర పర్యటనకు ఓ ఉన్నతాధికారి వెళ్లనున్నారని షర్మిల తెలిపారు. ఈ విషయమై ఓ పత్రికలో వచ్చిన ఆర్టికల్ ట్వీట్ చేశారు.
కేసీఆర్, నీ పాపాలపుట్ట పగులుతోంది, నీ నేరాలచిట్టా నాగుపామై కాటేసే రోజు దగ్గరలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మీ అవినీతిపై ఢిల్లీలో కాగ్ ని కలిసి ఆధారాలతో అందించిన ఫిర్యాదుకు, మా అవిశ్రాంత పోరాటానికి ఫలితం షురూ, ఇక మీ సర్కారు పతనం పెండింగ్. ఖబర్దార్ 420 కేసీఆర్, నీకు కూడా జైలు ఖాయం అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
కేసీఆర్, నీ పాపాలపుట్ట పగులుతోంది, నీ నేరాలచిట్టా నాగుపామై కాటేసే రోజు దగ్గరలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మీ అవినీతిపై ఢిల్లీలో కాగ్ ని కలిసి ఆధారాలతో అందించిన ఫిర్యాదుకు, మా అవిశ్రాంత పోరాటానికి ఫలితం షురూ, ఇక మీ సర్కారు పతనం పెండింగ్. ఖబర్దార్ 420 కేసీఆర్, నీకు కూడా జైలు ఖాయం pic.twitter.com/aEqsPKF50A
— YS Sharmila (@realyssharmila) March 9, 2023