YS Sharmila: గన్ పార్క్ సాక్షిగా వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసారు. సీఎం కేసీఆర్ పాలనపై పది ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. అమ్ముడు పోయే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అమరవీరుల సాక్షిగా చెప్తున్నాం..కేసీఅర్ తో పొత్తు అనేది ఎప్పటికీ ఉండదు అని ప్రకటించారు. తెలంగాణ పేరుతో ప్రాంతీయ పార్టీ ఉండటం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కేసీఅర్ కి సప్లయ్ కంపెనీగా మారిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం, మిషన్ భగీరథ పేర్లతో న్నారని వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అలా దోచుకున్న డబ్బుతోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారన్నారు. తెలంగాణ లో ఉన్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఇంతకాలం కేసీఅర్ మోచేతి నీళ్ళు తాగాయని విమర్శించారు. తెలంగాణ పేరుతో ప్రాంతీయ పార్టీ ఉండటం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అవినీతిని..అరాచకాన్ని ప్రశ్నించింది తానేనని చెప్పారు. తాను చేసిన 3850 కిలో మీటర్ల పాదయాత్ర తెలంగాణ ప్రజల కోసమేనని వివరించారు. కేసీఆర్ మిగుల బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని, ఇప్పుడు ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ఏమైందని షర్మిల నిలదీసారు. తాను ఇప్పటి వరకు కష్ట పడిందీ వేరే పార్టీలో విలీనం చేయటానికి కాదన్నారు. తానే ఏ పార్టీలోకి అయినా వస్తానంటే వద్దనేది ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ పార్టీలో చేరుతానన్నా..వద్దనడని చెప్పుకొచ్చారు. విలీనం అంటూ ఒక మహిళ నడుపుతున్న పార్టీని అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్టీపీ ఒంటరి గానే పోటీ చేస్తుందని స్పష్టం చేసారు. అన్ని నియోజక వర్గాల్లో సొంతగా అభ్యర్థులను బరిలోకి దింపుతుందని ప్రకటించారు. పొత్తులు అనేది రేపటి అంశంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఅర్ కి ఓటు వేసినట్లేనని వ్యాఖ్యానించారు.
పోస్ట్ ఎలక్షన్ తర్వాత కేసీఅర్ కి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా లేదా చెప్పాలన్నారు. కేసీఅర్ కి కాంగ్రెస్ మళ్ళీ సప్లయింగ్ కంపెనీగా మారదు అనే గ్యారెంటీ ఎంటని ప్రశ్నించారు. అన్ని పార్టీలు కేసీఅర్ కి వ్యతిరేకం అని క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. అప్పుడే పొత్తులకు సంబంధించి ఆలోచన చేస్తామని ప్రకటించారు. ఈ పదేళ్ల కాలంలో 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి… ప్రతిఒక్కరిపై లక్షన్నర అప్పు మీద పెట్టారని విమర్శించారు. రైతు రుణమాఫీ చేసేందుకు కూడా డబ్బులు లేవన్నారు. ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు. కేసీఆర్ కు బూట్లు పంపినా పాదయాత్రకు రావడం లేదన ఎద్దేవా చేసారు. తాము కేసీఆర్ తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని షర్మిల స్పష్టం చేసారు.