YS Sharmila: కేటీఆర్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్, ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు
YS Sharmila counter attack on KTR and KCR
వైఎస్ షర్మిల మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపైన, కేటీఆర్ పైనా విమర్శలు వర్షం కురిపించారు. జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ సభలో ప్రసంగించిన కేటీఆర్ గత పాలకులపై విమర్శలు గుప్పించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపారని కామెంట్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను షర్మిల తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టల దొర కొడుకా కేటీఆర్.. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు? అంటూ పలు ప్రశ్నలు సంధించారు. 33 ప్రాజెక్టులు కట్టి తెలంగాణ బీడు భూములకు నీళ్ళు పారించినందుకు YSR తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపినట్టా? రుణమాఫీ,ఉచిత కరెంట్,సబ్సిడీ పథకాలు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు కొట్టి చంపినట్టా? అని ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీ, పక్కా ఇళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, లక్షల కొద్దీ సర్కార్ ఉద్యోగాల భర్తీ ఇవన్నీ ప్రజలను కొట్టి చంపినట్లేనా? అని ప్రశ్నించారు. నిజానికి తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపుతున్నది నీ అయ్య కసాయి రావే అని షర్మిల విమర్శించారు.
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని నీ కుటుంబం కోసం నాలుగున్నర లక్షల కోట్లుఅప్పు చేసి చంపేసిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను, రుణమాఫీ అని రైతులను చంపుతున్నది నిజం కాదా? ఫీజులు చెల్లించక విద్యార్థులను, పోడుపట్టాలు ఇస్తామని గిరిజన బిడ్డలను కొట్టి చంపుతున్నది నీ అయ్య కసాయిరావే కదా? అని షర్మిల ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుంటే తెలంగాణను దర్జాగా దోచుకుంటున్న దొంగలు మీరు. ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు కాజేసింది మీరు. మీ అక్రమాలకు అడ్డొస్తే, ప్రశ్నిస్తే చావగొట్టేది మీరు. తల్లిలాంటి తెలంగాణను చంపుతున్న అసలు కసాయి గూండాలు మీరే అని షర్మిల విమర్శించారు. ఈసారి ఓటు కోసం కాలు బయట పెట్టి చూడు. నీకు, నీ అయ్యకు ఆ రోకలి
బండే సమాధానం చెబుతుందని షర్మిల విమర్శించారు.
పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టల దొర కొడుకా కేటీఆర్.. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు? 33 ప్రాజెక్టులు కట్టి తెలంగాణ బీడు భూములకు నీళ్ళు పారించినందుకు YSR తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపినట్టా? రుణమాఫీ,ఉచిత కరెంట్,సబ్సిడీ పథకాలు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు
1/4— YS Sharmila (@realyssharmila) March 16, 2023
అప్పు చేసి చంపేసిన మాట నిజం కాదా? ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను, రుణమాఫీ అని రైతులను చంపుతున్నది నిజం కాదా? ఫీజులు చెల్లించక విద్యార్థులను, పోడుపట్టాలు ఇస్తామని గిరిజన బిడ్డలను కొట్టి చంపుతున్నది నీ అయ్య కసాయిరావే కదా? ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుంటే
3/4— YS Sharmila (@realyssharmila) March 16, 2023
తెలంగాణను దర్జాగా దోచుకుంటున్న దొంగలు మీరు. ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు కాజేసింది మీరు.మీ అక్రమాలకు అడ్డొస్తే, ప్రశ్నిస్తే చావగొట్టేది మీరు. తల్లిలాంటి తెలంగాణను చంపుతున్న అసలు కసాయి గూండాలు మీరే. ఈసారి ఓటు కోసం కాలు బయట పెట్టి చూడు. నీకు, నీ అయ్యకు ఆ రోకలి బండే సమాధానం.
4/4— YS Sharmila (@realyssharmila) March 16, 2023