YS Avinash Reddy: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి భవితవ్యం నేడు తేలిపోనుంది. అవినాశ్ ముందస్తు బెయిల్ పై నేడు విచారణ జరగనుంది. సుప్రీం ఆదేశాల మేరకు గురువారం తెలంగాన హైకోర్టు విచారణకు స్వీకరించింది. సమయం ముగియటంతో ఈ రోజు విచారణ చేయనుంది.
ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.రేపు ఉదయం 10.30 గంటలకు సీబీఐ వాదనలు రేపు వింటామని స్పష్టం చేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా అవినాశ్ రెడ్డి లాయర్, సునీతారెడ్డి లాయర్ల వాదనను విన్న తెలంగాణ హైకోర్టు రేపు సీబీఐ వాదనలు విననుంది. సీబీఐ వాదనలు విన్న తర్వాతనే తన తీర్పు వెలువరించనుంది.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆసక్తికర ఘనట చోటుచేసుకుంది. అవినాశ్ రెడ్డి లాయర్ తన వాదనలు వినిపించిన తర్వాత, సునీతారెడ్డి లాయర్ తన వాదనలు వినిపించేందకు సిద్ధమయ్యారు.ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జడ్జికి కోపం తెప్పించాయి. అవినాశ్ రెడ్డి లాయర్‌కు ఎంత సమయం కేటాయించారో తనకు అంతే సమయం కేటాయించాలని సునీతారెడ్డి లాయర్ డిమాండ్ చేశారు. దీంతో జడ్జి అసహనానికి గురయ్యారు. లిమిట్స్ లో ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు. అందరి వాదనలూ ఈ రోజే వింటానని కూడా స్పష్టం చేశారు.
వైఎస్ భాస్కర్‌రెడ్డికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం భాస్కర్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బీపీ పెరగడంతో ఉస్మానియాలో వైద్యులు చికిత్స అందించారు. చికిత్స తర్వాత భాస్కర్‌రెడ్డిని పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం రేపు నిమ్స్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని హైదరాబాద్ తీసుకొచ్చారు. అనారోగ్యంతో ఈనెల 19 నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆమె పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. డిశ్చార్జ్ అనంతరం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి తన తల్లిని తీసుకుని ఏఐజీకి వెళ్లారు.
ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు పలు అంశాలను ప్రస్తావించింది. సీబీఐ అధికారులను కొన్ని ప్రశ్నలు వేసింది. వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్ రికార్డు చేశారా అని ప్రశ్నించింది. వాచ్మెన్ రంగన్న ఏం చెప్పాడని హైకోర్టు ప్రశ్నించింది. సిట్ పోలీసులకు రంగన్న ఇచ్చిన స్టేట్మెంచ్ చాలా కీలకమని హైకోర్టు అభిప్రాయపడింది.
అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ విషయంలో తెలంగాణ హైకోర్టులో వానదలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. భోజన విరామం తర్వాత విచారణ తిరిగి ప్రారంభం అయింది. లాయర్లు తమ వాదన వినిపిస్తున్నారు.
కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు వాడీ వేడిగా జరుగుతున్నాయి. అవినాష్ తరఫున న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు
కరోనా వ్యాక్సిన్ కోసం, మందులు కోసం కేంద్రం డబ్బులు ఇస్తే ప్రకటనల కోసం వాడేసారని, ఇలాంటి పరిపాలనలో మనం ఉన్నామని అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఏం కట్టలేదని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను అశోక్ గజపతి రాజు ఖండించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం అన్నీ కట్టామని గుర్తుచేశారు. కానీ ఏదో అవినీతి జరిగిందని చెప్పి ప్రజా వేదికను కూల్చేసారు. మన అదృష్టం ఏంటంటే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులను కూల్చలేదని ఎద్దేవా చేశారు. ప్రజా ధనాన్ని మింగుతూ, 16 నెలలు జైల్లో ఉండి వచ్చి.. ఇప్పుడు ప్రజలు జీవితాలను నవ్వులపాలు చేస్తున్నారని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు అశోక్.
సీబీఐ నోటీసులు ఇస్తూనే ఉన్నారు గానీ... కనీసం అవినాష్ రెడ్డిని అరెస్టు కూడా చేయలేకపోతున్నారని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అచ్చెన్నాయుడుకు నోటీసులు కూడా ఇవ్వలేదని... బోనస్ గా కరోనా అంటించి పంపారని అశోక్ గజపతి రాజు గుర్తుచేశారు.
వివేకా హత్యకు అవినాశ్ కు సంబంధం లేదని, వ్యక్తిగత కక్ష్యలతోనే ఆయన్ను హత్య చేశారని అవినాశ్ తరపు న్యాయవాది
హై కోర్టు బెంచ్ ముందు వాదనలు వినిపిస్తున్నారు. భూతగదాలు, అక్రమ సంబంధాలే ఈ హత్యకు కారణమని అవినాశ్
తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గుండెపోటు అనేది అక్కడ ఉన్న ప్రాథమిక సమాచారం మాత్రమేనని, గుండెపోటు
ఆధారంగా దర్యాప్తు జరగలేదని, ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని అవినాశ్ న్యాయవాది వాదించారు.
కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సుదీర్ఘ విచారణ కొనసాగుతోంది. అవినాష్ తరఫున న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు సీబీఐ ఎస్పీ వికాష్ కుమార్ చేరుకున్నారు. అవినాష్ ముందస్తు బెయిల్‌పై జరుగుతున్న వాదనలు ఆయన వింటున్నారు. సీబీఐ కౌంటర్‌ను అవినాష్ న్యాయవాది తప్పుపట్టారు. అవినాష్ నిందితుడని సీబీఐ రికార్డుల్లో ఎక్కడా చెప్పలేదన్నారు. గుండెపోటు అని చెప్పినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని అన్నారు. అవినాష్ పోలీసో, డాక్టరో కాదు కాదా? అని లాయర్ ఉమా మహేశ్వరరావు వాదించారు.
వారం రోజుల పాటు కర్నూలులో తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో ఉన్న కడప ఎంపి అవినాశ్ రెడ్డి అవినాశ్ రెడ్డి
ఇవాళ ఉదయం హైదరాబాద్ బయల్దేరారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు తల్లితో కలసి అవినాశ్ హైదరాబాద్ బయల్దేరారు.
అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆయనకు బెయిల్
ఇస్తే ఎదురయ్యే పరిణామాలు వివరిస్తూ సీబీఐ అధికారులు కౌంటర్ మెమో దాఖలు చేశారు.
వారం రోజుల పాటు కర్నూలులో తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో ఉన్న కడప ఎంపి అవినాశ్ రెడ్డి అవినాశ్ రెడ్డి
ఇవాళ ఉదయం హైదరాబాద్ బయల్దేరారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశముంది.
ఆమెను మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించే అవకాశముందని సమాచారం.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హై కోర్టులోవాదనలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది
అవినాశ్ తరపున లాయర్ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో అదనపు అఫిడవిట్ ను సీబీఐ దాఖలు చేసింది.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో సునీతా రెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశముంది.. అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని సునీత తరపు న్యాయవాదులు కూడా తమ వాదనను వినిపించబోతున్నారు.
ఓ వైపు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హై కోర్టులో వాదనలు జరుగుతుండగా.. కర్నూలులో టెన్షన్
వాతావరణం నెలకొంది... కర్నూలు విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి దగ్గర ఉన్న అవినాశ్ అరెస్ట్
అయ్యేందుకు అవకాశాలున్నాయన్న సమాచారంతో ఉత్కంఠ మొదలైంది.
తెలంగాణ హై కోర్టు వెకేషన్ బెంచ్ కు శుక్రవారం సెలవు అయినప్పటికీ ఈ కేసు కోసమే ప్రత్యేకంగా న్యాయమూర్తులు కోర్టుకు రానున్నారు. గురువారం సాయంత్రం విచారణ ప్రారంభమైనప్పటికీ సమయం లేకపోవడంతో వాయిదా పడింది. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుదీర్ఘ వాదనలు కొనసాగే అవకాశముంది... సీబీఐ తరపు న్యాయవాదులు, అవినాశ్ రెడ్డి న్యాయవాదులు న్యాయమూర్తుల ఎదుట తమ వాదనలు వినిపిస్తారు.