Yadadri: వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న యాదాద్రి
Yadadri: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం సిద్దమౌతున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు. పునర్నిర్మితమైన దివ్యాలయంలో వచ్చేఏడాది జనవరి 2 వ తేదీన తొలిసారి వైకుంఠ ద్వార దర్శనంను కల్పించబోతున్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున యాదాద్రికి వచ్చే అకవాశం ఉండటంతో ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దైవదర్శనం, ఆరాధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పునర్నిర్మాణం తరువాత యాదాద్రికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. యాదాద్రి చుట్టుపక్కల ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ది చేస్తున్నారు.