Arvind on Bandi Sanjay Comments: ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకోవాలి
Arvind on Bandi Sanjay Comments: తెలంగాణలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నుండే వ్యతిరేకత వస్తున్నది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించేది లేదని వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. సామెతలను వినియోగించేసమయంలో జాగ్రత్త వహించాలని, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని అనుకుంటున్నామని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే మంచిదని హితవుపలికారు. ఇక, ఈడీ అధికారులకు కవిత సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని, తప్పుడు సమాధానాలు చెబితే ఫలితం వేరుగా ఉంటుందని అన్నారు.
ఈడీ విచారణ సమయంలో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఢిల్లీ వెళ్లిందని, అలా ఎందుకు వెళ్లిందో సమాధానం చెప్పాలని అన్నారు. విచారణ కవిత మాత్రమే ఎదుర్కొంటోందని, దానికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం ఏముందని అన్నారు. ఢిల్లీ ప్రజల సొమ్మును దోచుకోవడం సరికాదని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. నిజానిజాలన్నీ తప్పకుండా బయటకు వస్తాయని, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు.