మునుగోడు ఎన్నికల ఫలితాలు ఆదివారం రోజున వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చినప్పటికీ నైతికంగా బీజేపీకి భారీ లాభం చేకూర్చింది. కనీస ఓటుబ్యాంకు కూడా లేని బీజేపీకి మునుగోడులో భారీ ఓటు బ్యాంకు సాధించుకునే అవకాశం కల్పించింది. మునుగోడులో విజయం సాధించకపోయినా, ఓటు బ్యాంకు సాధించుకోవడంతో 2023 ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాను వ్యక్తం చేస్తున్నది. ఇక, ఈ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని మంత్రులందర్ని రంగంలోకి దించింది.
Munugodu: మునుగోడు ఎన్నికల ఫలితాలు ఆదివారం రోజున వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చినప్పటికీ నైతికంగా బీజేపీకి భారీ లాభం చేకూర్చింది. కనీస ఓటుబ్యాంకు కూడా లేని బీజేపీకి మునుగోడులో భారీ ఓటు బ్యాంకు సాధించుకునే అవకాశం కల్పించింది. మునుగోడులో విజయం సాధించకపోయినా, ఓటు బ్యాంకు సాధించుకోవడంతో 2023 ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాను వ్యక్తం చేస్తున్నది. ఇక, ఈ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని మంత్రులందర్ని రంగంలోకి దించింది.
మండలాలు, గ్రామాల వారిగా బాధ్యతలు అప్పగించింది. అయితే, మంత్రులు ఇన్చార్జులుగా కొన్ని కొన్ని గ్రామాల్లో టీఆర్ఎస్కు భారీ స్థాయిలో షాక్ తగిలింది. మంత్రి మల్లారెడ్డి ఇన్చార్జ్గా ఉన్న గ్రామంలో బీజేపీ 450 ఓట్ల ఆధిక్యం లభించగా, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించిన గ్రామంలో 497 ఓట్లు, మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి ఇన్చార్జులుగా ఉన్న గ్రామాల్లో బీజేపీకి ఆధిక్యం లభించడం విశేషం. అయితే, కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు ఇన్చార్జులుగా ఉన్న గ్రామాల్లో మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం లభించింది.