Viral Flu: హైదరాబాద్ నగరాన్ని వణికిస్తున్న వైరల్ ఫ్లూ, ICMR కీలక సూచనలు
Viral Flu cases are increasing day by day in Hyderabad
హైదరాబాద్ నగరంలో వైరల్ ఫ్లూ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం రోజులుగా రోజుకు 600 నుంచి 800 మంది ఈ వైరల్ ఫ్లూ బారిన పడుతున్నట్లు హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫ్లూ ఉన్నవారిలో జ్వరంతో పాటు విపరీతమైన దగ్గు కూడా ఉంటుందని వైద్యులు తెలిపారు.
తెలంగాణతో పాటు దేశంలో మరికొన్ని రాష్ట్రాలలో కూడా ఫ్లూ కేసులు అధికం కావడంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అప్రమత్తం అయింది. కొన్ని సూచనలు చేసింది. ఇటువంటి సమయంలో సొంత వైద్యం చేసుకోవద్దని సూచించింది. వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలని, వైద్యుల సూచనలు లేకండా ఎటువంటి మాత్రలూ వాడవద్దని స్పష్టం చేసింది.
ఫ్లూ వ్యాధి ప్రాణాంతక వ్యాధి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, విరోచనాలు వంటి వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వైరల్ ఫ్లూ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇటువంటి సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైరల్ ఫ్లూను ఎదుర్కోడానికి మందులు ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రులో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా మందులకు కొరత లేదని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు.