సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలుకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో దక్షణి మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. అదనపు బోగీలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ ట్రైన్ కెపాసిటీ 1128కి పెరిగింది. రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
Vande Bharat Secunderabad Tirupati trains will carry more than twice the passengers from May 17
సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలుకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో దక్షణి మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. అదనపు బోగీలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ ట్రైన్ కెపాసిటీ 1128కి పెరిగింది. రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ఇప్పటి వరకు 530 సీట్లు ఉన్న వందే భారత్ తిరుపతి ట్రైన్ రెట్టింపు ప్రయాణికులతో ప్రయాణం చేయనుంది. కొత్త కంపోజిషన్‌లో 1128 సీట్ల సామర్థ్యంతో 14 ఛైర్ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్లతో 104 సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.
15 నిమిషాల ముందుగ గమ్యస్థానం
ఇక నుంచి ఈ ట్రైన్ జర్నీ 15 నిమిషాలు తగ్గనుంది. అంతకు ముందు పట్టే సమయం కన్నా 15 నిమిషాల ముందే గమ్యస్థానాలకు చేరనుంది. ఈ విధానం కూడా మే 17 నుంచి అమలు కానుంది.
సికింద్రాబాద్ తిరుపతి వందే భారత ప్రారంభమైన నాటి నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ప్రారంభమైన నాటి నుంచి మే 15 వరకు 44,992 మంది ప్రయాణికులు ఈ వందే భారత్ ట్రైన్లో ప్రయాణం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
వందే భారత్ రివైజ్డ్ షెడ్యూల్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం 6.15 నిమిషాలను బయలుదేరే వందే భారత్ ట్రైన్ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. మధ్యలో నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో ఆగుతోంది. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు తిరుపతి చేరుకునే వందే భారత్ తిరిగి మధ్యాహ్నం 3.15 నిమిషాలకు అక్కడి నుంచి బయలు దేరి రాత్రి 11.30 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోనుంది.