US Consulate: ఈ నెల 20న నానక్‌రామ్‌గూడలో యూఎస్ కాన్సులేట్ ప్రారంభం
US Consulate: హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని యూఎస్ కొత్త కాన్సులేట్‌లో సేవలు మార్చి 20 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్-లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌లో ఉన్న ఈ కాన్సులేట్ జనరల్‌ను నానక్‌రామ్‌గూడలోని కొత్త బిల్డింగులోకి తరలించనున్నారు. ఈ నూతన కార్యాలయాన్ని సుమారు రూ.2800 కోట్లతో నిర్మించారు
ఈ నెల 20న ఉదయం 8.30 గంటల నుంచి కొత్త బిల్డింగులో కాన్సులేట్ సేవలు స్టార్ట్ చేస్తామని చెప్పారు. దాదాపు 5 రోజులపాటు కాన్సులేట్ మూసివేయనున్నట్లు తెలిపారు. మార్చి 8 మరియు 15 మధ్య వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయబడిన వీసా దరఖాస్తుదారులు తమ ఇంటర్వ్యూల కోసం పైగా ప్యాలెస్‌కు వెళ్లాలి మరియు మార్చి 23న లేదా ఆ తర్వాత షెడ్యూల్ చేయబడిన వీసా ఇంటర్వ్యూ ఉన్నవారు నానక్ రామ్ గూడలోని యూ ఎస్ కాన్సులేట్ కొత్త భవనానికి వెళాల్సిఉంటుంది.