Uppal Skywalk start from April: తుది దశకు ఉప్పల్ స్కైవాక్
Uppal Skywalk start from April: ఉప్పల్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న స్కైవాక్ పనులు తదిదశకు చేరుకున్నాయి. రూ. 25 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుండి ఈ స్కైవాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 660 మీటర్ల పొడవైన ఈ స్కైవాక్ కోసం 9 లిఫ్ట్‌లను, మూడు ఎస్క్‌లేటర్లను నిర్మిస్తున్నది. ఉప్పల్ జంక్షన్ వద్ద నిత్యం ట్రాఫిక్ బిజీగా ఉంటుంది. ఈప్రాంతంలోనే మెట్రో స్టేషన్ కూడా ఉండంతో కూడలి నుండి మెట్రో స్టేషన్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటడం పాదచారులకు కష్టంగా ఉండటంతో ప్రభుత్వం ఈ స్కైవాక్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగానే రూ. 25 కోట్ల వ్యయంతో ఉప్పల్ లో ప్రయోగాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం విజయవంతమైతే మరిన్ని ప్రాంతాల్లో ఈ స్కైవాక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. ఇప్పటికే నగరంలో బిజీగా ఉండే ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు వంతెనలు నిర్మిస్తున్నారు. కాగా, ఉప్పల్ తరహా వంతెనలు నగరంలో నిర్మించడం ఇదే తొలిసారి. ఈ వంతెన నిర్మాణం పనులను నగర పురపాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ పరిశీలించారు. ఏప్రిల్ నెలలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.