తాను ఏం తప్పు చేశానో అర్ధం కాలేదని .. తనను ఎందుకు బీఆర్ఎస్ ఇలా బలి చేసిందోనని భేతి సుభాష్ రెడ్డి (Bheti Subhash Reddy)ఎమోషనల్ అయ్యారు.నిజానికి తనకు టికెట్ కేటాయించకపోవడంతో తన కేడర్ అంతా ఆందోళన చేస్తామంటే.. తానే వద్దని వారించానని చెప్పారు.
Bheti Subhash Reddy : 2001 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచీ కూడా తాను పార్టీలోనే ఉన్నానని చెప్పుకొచ్చిన భేతి సుభాష్ రెడ్డి(Bheti Subhash Reddy).. ఎన్నో ఇబ్బందులు, తిప్పలు పడి ఉప్పల్లో పార్టీని కాపాడానని గుర్తు చేశారు. ఇప్పుడు తనను కాదని ఉప్పల్ టికెట్ వేరేవాళ్లకు ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బండారు లక్ష్మారెడ్డి(Bandaru Lakshmareddy) పార్టీ కోసం ఏం చేశాడని ప్రశ్నించిన ఆయన .. ఏనాడైనా పార్టీ జెండా మోసిండా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తికి సీఎం కేసీఆర్ టికెట్ ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు.
ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి అయిన బండారు లక్ష్మారెడ్డి(Bandaru Lakshmareddy) ఇప్పటికీ కాంగ్రెస్ నేతల ఫొటోలే పెట్టుకుని తిరుగుతున్నాడని భేతి సుభాష్ రెడ్డి (Bheti Subhash Reddy)ఆరోపించారు. గ్రేటర్లో తాను ఒక్కడినే ఉద్యమకారుడినంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ టికెట్ వేరే వ్యక్తికి ఇచ్చే ముందు అయినా అధిష్టానం కనీసం తనతో చర్చించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం తప్పు చేశానో అర్ధం కాలేదని .. తనను ఎందుకు ఇలా బలి చేశారోనని భేతి సుభాష్ రెడ్డి (Bheti Subhash Reddy)ఎమోషనల్ అయ్యారు.నిజానికి తనకు టికెట్ కేటాయించకపోవడంతో తన కేడర్ అంతా ఆందోళన చేస్తామంటే.. తానే వద్దని వారించానని చెప్పారు. 10 రోజుల్లో తన భవిష్యత్ కార్యచరణ ఏంటి అనేది ప్రకటిస్తానని భేతి సుభాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.