Union Minister Jitendra Singh: ప్రపంచానికి ఫార్మా రాజధానిగా హైదరాబాద్..కేంద్ర మంత్రి జితేంద్రసింగ్
Union Minister Jitendra Singh: ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్‌గా హైదరాబాద్ ఫార్మా సిటీ నిలుస్తున్నదని..కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. హైదరాబాద్ లోని ద ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి ఉత్పత్తి చేయబడిన భారతదేశంలోని ఫార్మా , బయోటెక్ పరిశ్రమకు ఒక వరమని మంత్రిపేర్కొన్నారు. తార్నాకలోని సీఎస్ఐఆర్–ఐఐసీటీలో వన్ వీక్ వన్ ల్యాబ్ పేరుతో నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను మంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజధాని అని కొనియాడారు.
ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలతో పాటు కెమికల్ టెక్నాలజీలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి సాధించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేయడంలో హైదరాబాద్ ఇప్పటికే ముందంజలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 37 సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌లలో ఒక్కో దానిని ఒక్కో రంగానికి కేటాయించమన్నారు. యువ సైంటిస్టులను ప్రోత్సహించేందుకు ‘వన్ వీక్ వన్ ల్యాబ్’ఈవెంట్‌ను ప్రవేశపెట్టామన్నారు. ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులను కట్టడి చేసే జనరిక్ మందుల తయారీ ఐఐసీటీ సాంకేతికతతోనే సాధ్యమైందని చెప్పారు. 4,500 మందికి పైగా శాస్త్రవేత్తల సమూహంతో, సీ ఎస్ ఐ ఆర్ అమృత్ కాల్‌లో గ్లోబల్ సెంటర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ గా ఆవిర్భవించిందని అన్నారు. వ్యాక్సిన్ రంగంలో భారత్ బయోటెక్ సహకారంతో మనదేశం ప్రపంచానికే అదర్శంగా నిలిచిందన్నారు.