Ujjaini Mahankali Bonalu : సికింద్రాబాద్‌లో రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic restrictions in Secunderabad for two days : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల దృష్ట్యా ఆది, సోమవారాల్లో ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఆదివారం ఉదయం 4 గంటల నుండి సోమవారం బోనాలు వేడుకలు పూర్తయ్యే వరకు ప్రజలు కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్‌పేట్, ప్యారడైజ్, CTO ప్లాజా, SBI ఎక్స్ రోడ్, YMCA ఎక్స్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ X రోడ్, పార్క్ లేన్, ఘస్మండి ఎక్స్ రోడ్స్, బైబిల్ హౌస్, మినిస్టర్ రోడ్, రసూల్‌పురాలోని రోడ్డు, జంక్షన్లను పూర్తిగా మూసేస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. .
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు సకాలంలో రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి ముందుగానే బయలుదేరాలి. ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వైపు నుండి కాకుండా చిలకలగూడ వైపు నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్.10 ద్వారా చేరుకోవాలి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుంది.
1. పొగాకు బజార్, హిల్ స్ట్రీట్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారిపై అన్ని వాహనాల రాకపోకలు బంద్
2. బాటా X రోడ్స్ నుండి ప్రారంభమయ్యే సుబాష్ రోడ్డు పాత రాంగోపాల్‌పేట PS, సికింద్రాబాద్ వరకు అన్ని వాహనాల రాకపోకలు క్లోజ్.
3. సికింద్రాబాద్ ఔడయ్య ఎక్స్ రోడ్స్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారి బంద్.
4. జనరల్ బజార్ సికింద్రాబాద్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారిని కూడా ఈ రెండ్రోజుల పాటు మూసేస్తున్నారు.
5. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మధ్య సెయింట్ మేరీస్ రోడ్ / క్లాక్ టవర్ వైపు ఉన్న రహదారిని మూసేస్తున్నారు.
6. హకీంపేట్, బోయిన్ పల్లి, బాలానగర్, అమీర్‌పేట్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే అన్ని బస్సులు క్లాక్ టవర్ వరకే వెళ్తాయి. అవి అదే మార్గంలో తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి.