TSRTC Business: టీఎస్ఆర్టీసీ సరికొత్త వ్యాపారం… సొంత బ్రాండ్ పేరుతో వాటర్
TSRTC Entered into Drinking Water Business: తెలంగాణ ప్రజారావాణ సంస్థ టీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నది. ఇందులో భాగంగా మంచినీటి వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. జీవా పేరుతో సొంత బ్రాండ్‌ను క్రియోట్ చేసుకొని ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లను విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం మంచినీటి విక్రయానికి మంచి డిమాండ్ ఉన్నది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ చూస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్టాండ్‌లలో వివిధ వాటర్ కంపెనీలకు చెందిన ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారు. ఇకపై బస్టాండ్లలో సొంత బ్రాండ్ పేరుతో విడుదల చేయబోతున్న వాటర్ బాటిళ్లను విక్రయించే విధంగా టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.
అదేవిధంగా బస్సుల్లో కూడా సొంత బ్రాండ్ వాటర్ బాటిళ్లనే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. సొంత బ్రాండ్‌కు పబ్లిసిటీ వస్తే, తద్వారా ఆదాయం పెరుగుతుందని, ఆర్టీసీతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వాటర్ బాటిళ్ల విక్రయాలు చేపట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మంచినీటి వ్యాపారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. సమ్మర్ సీజన్‌లో ఈ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ వాటర్ బ్రాండ్ బిజినెస్‌కు ప్రారంభించనున్నారు.