TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక భేటీ, లీకేజీ వ్యవహారంపై సీరియస్ డిస్కషన్
TSPSC review meeting on the Exam Papers leakage
అసిస్టెంట్ ఇంజనీరు పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెడకు చుట్టుకుంది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో సర్వీసు కమిషన్ దిద్దుబాటు చర్యలకు దిగింది. తక్షణం ఏం చేయాలనే విషయంపై చర్చిస్తున్నారు.సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ నెల 5న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీ పై కమిషన్ సభ్యులు చర్చిస్తున్నారు. AE పరీక్ష రద్దు చేసే యోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రూప్ వన్ పరీక్షపై వస్తున్న అనుమానాలను కమిషన్ సభ్యులు పరిశీలిస్తున్నారు. లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ ఎగ్జామ్ సమయంలో వ్యవహరించిన తీరు… అతడి పేపర్ పై చర్చ చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ అభ్యర్థుల ఆందోళనలు ఉదృత మైన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు లీకేజిల వ్యవహారం పై ప్రభుత్వం సీరియస్ అయింది. లీకేజీ వ్యవహారంపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ కోరింది..
విద్యార్ధి సంఘాల ఆందోళన
తెలంగాణ పోటీ పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయనే విషయం వెలుగు చూడడంతో విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.
టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని విద్యార్ధి సంఘాలు ముట్టడించాయి. పేపర్ లీకేజీకి కారకులను వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. TSPSC బోర్డును తొలగించారు. బీజేపీ విద్యార్ధి విభాగం, కాంగ్రెస్ విద్యార్ధి విభాగాలు కూడా ఆందోళన కారులకు అండగా నిలిచారు. లీకేజీ విషయమై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
లక్షలాది మంది విద్యార్ధులకు ఇబ్బంది కలిగించే ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించాలని, అధికారులను అరెస్టు చేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ ఇంకా ఎన్ని పరీక్షలకు చెందిన పేపర్లు లీక్ చేశాడో తేల్చాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి.