TSPSC Papers Leakage: మరో రెండు ప్రశ్నా పత్రాలు లీకేజ్
TSPSC Papers Leakage: టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో ఇప్పటికే మూడు ప్రశ్నా పత్రాలు ఉన్నట్లు గుర్తించగా, తాజాగా మరో రెండు ప్రశ్నాపత్రాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈనెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్షతో పాటు టౌన్ ప్లానింగ్, వెరర్నరీ అసిస్టెంగ్ ఎగ్జామ్స్ పేపర్లను గుర్తించి ఇప్పటికే వాటిని రద్దు చేశారు. ఇప్పుడు ఎంఐవీ, గ్రౌండ్ వాటర్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను గుర్తించడంతో అధికారులు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
అతని పెన్‌డ్రైవ్‌లో గుర్తించిన రెండు ప్రశ్నాపత్రాలను విషయాన్ని ఎఫ్ఎస్ఎల్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందానికి తెలియజేశారు. ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాలను ఎవరికి ఇచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులకు షాకింగ్ విషయాలను గుర్తించారు. సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మహిళల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. మహిళలతో న్యూడ్ చాటింగ్, న్యూడ్ వీడియోస్ ఉన్నాయి. దీంతో వారంతా ఎవరనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. లీకేజీ వ్యవహరం బయటకు రావడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.