Group 2 Exam: ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ – 2 పరీక్షలు
Group 2 Exam: గ్రూప్ – 2 పరీక్షల తేదీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ – 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వారం ముందు హాల్ టికెట్లు డౌన్ లోడు చేసుకోవచ్చని వెల్లడించింది. మొత్తం నాలుగు పేపర్లకు గాను ఆగస్టు 29న ఫస్ట్, సెకండ్ పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 30న మూడు, నాలుగో పేపర్ కు పరీక్ష జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
29న పేపర్1 జనరల్ ఎబిలిటీస్, స్టడీస్ , పేపర్2 చరిత్ర, రాజకీయం, సమాజం , 30న పేపర్3 ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి , పేపర్4 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఒక్కో పరీక్షకు మూడు గంటల సమయం తో పాటు ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
గ్రూప్ 2 ఉద్యోగాలకు ఫిబ్రవరి 16వ తేదీతో గడువు ముగియగా మొత్తం 783 పోస్టులకు 5,51,943 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భాగంగా వచ్చిన దరఖాస్తులను పోల్చితే ఒక్కో పోస్టుకు 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను https://tspsc.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.