Tsrtc: ఎఫ్ 24 టికెట్లు విడుదల చేసిన టీఎస్ ఆర్టీసీ
Tsrtc: హైదరాబాద్ వాసులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పంది. నగరంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రయాణాల కోసం F-24 టికెట్ టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వినూత్న పథకాలతో ప్రయాణికులను ఆకర్శిస్తున్న టీఎస్ ఆర్టీసీ ఈ కొత్త పథకాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ టికెట్లను నిన్నటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే మహిళలు, సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన టి-6 టికెట్‌ను కొనుగోలు చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 6 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వీలుందని తెలిపింది.
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. మరోవైపు నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను కూడా నగరంలో తిప్పనుంది. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని ఎం.డి సజ్జనార్ తెలిపారు.