Somesh Kumar: సోమేశ్ కుమార్‌కి మరో షాక్, ఈ నెల 12లోగా ఏపీ వెళ్లాలని DOPT ఆదేశం
TS Chief Secretrary Some Kumar was directed to report AP government by January 12
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కి వరుస పెట్టి షాకులు తగులుతున్నాయి. తెలంగాణలో విధులు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించిన కొన్ని గంటల్లోనే కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 12లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని DOPT ఆదేశించింది. తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఏఎస్‌ల విభజన సమయంలో సోమేశ్‌ను ఏపీకి కేటాయించగా…క్యాట్ నుంచి మినహాయింపు పొందారు. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఏపీకి వెళ్లాల్సిందేనని హైకోర్టు ఈ రోజు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో కేంద్రం కూడా వెంటనే స్పందించింది. DOPT తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది.