TRS to BRS: పార్టీ పేరు మార్పు లాంఛనమే…
TRS to BRS: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. దసరా పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని పత్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనున్నది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు మంజూరైన వెంటనే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చనున్నారు. బీఆర్ఎస్ పేరు మార్పుపై ఎన్నికల కమిషన్ అభ్యంతరాల స్వీకరణకు ఈరోజుతో గడువు ముగియనున్నది. కాగా, నేడు దీనిపై ఈసీ నిర్ణయం తీసుకొనున్నది. ఈసీ నుంచి నిర్ణయం వెలువడిన వెంటనే పేరును మార్చనున్నారు. పేరు మార్చిన వెంటనే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పావులు కదవపున్నారు.