Modi’s Report Card : ప్రధాని రిపోర్ట్ కార్డు వైరల్
TRS social media convener releases Modi’s ‘report card’ : సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నేత రిలీజ్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రిపోర్ట్ కార్డు వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్డి సోమవారం ప్రధాని నరేంద్ర మోదీపై సాయిల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. “మా స్వంత, మిస్టర్ మోడీ ప్రోగ్రెస్ కార్డ్!” అంటూ వివిధ ఇండెక్స్‌ల పరంగా భారతదేశం ర్యాంక్‌లకు సంబంధించిన జాబితాను ప్రధాని మోదీ ‘రిపోర్ట్ కార్డ్’ అంటూ ఆయన ట్విట్టర్ లో విడుదల చేశారు. అందులో ఆయన మార్కులతో పాటు గ్రేడ్ ను కూడా కేటాయించడం గమనార్హం. ఇంతకుముందు కూడా ‘బై బై మోడీ’ అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని ఉన్న గ్యాంగ్ కు సంబంధించిన అనేక వీడియోలను సతీష్ రెడ్డి పంచుకున్నారు. ఎల్బీ నగర్లో భారతీయ జనతా పార్టీని, ప్రధాని మోదీని ఉద్దేశించి వేసిన ‘మనీ హీస్ట్’ పోస్టర్ ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.
Our very own, Mr Modi’s Progress Card !👇🏻 pic.twitter.com/Nbo0RuCpNu
— YSR (@ysathishreddy) July 11, 2022