Bandi Sanjay: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం పై తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. మునుగోడు ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని గెలుపు కు పొంగిపోమని.. ఓటమికి కుంగి పోమని అన్నారు. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ పెద్దగా గెలవలేదని అన్నారు.ఎంతో టఫ్ ఫైట్ చేశామని అయిన ప్రజలు మాకు బారి మెజారిటీని ఇచ్చారన్నారు.మద్యం,డబ్బులు పంచి విధ్వంసాలను సృష్టించి మునుగోడు లో తెరాస టిఆర్ఎస్ గెలిచిందన్నారు.
ఈ ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను సీఏం కేసీఆర్ 15 రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడులో ఎన్ని రకాలుగా బెదిరించినా వీరోచితంగా పోరాడిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 12 మందిని సీఏం కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరగలరా అని ప్రశ్నించారు. మునుగోడు గెలుపు కేసీఆర్‌దా.. కేటీఆర్‌దా.. హరీశ్‌రావుదా, సీపీఐదా, సీపీఏందా లేకపోతే పోటీచేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిదా.. ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తే వచ్చింది 11వేల లోపు మెజార్టీ మాత్రమేనని తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పనిచేస్తే.. బీజేపీ తరఫున ఓ సామాన్య కార్యకర్త పనిచేశారని అన్నారు.