మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్నది. నేటితో ఈ ఎన్నికల ప్రచారానికి తెరపడనున్నది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పలు గ్రామాల్లో బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది.
Munugodu Bypoll: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్నది. నేటితో ఈ ఎన్నికల ప్రచారానికి తెరపడనున్నది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పలు గ్రామాల్లో బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది.
సైదాబాద్, ఆరెగూడెంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డిని అక్కడి నుంచి తరలించారు. అధికార పార్టీ ఆడగాలు మరింతగా పెరిగిపోయాయని, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధించి తీరుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనిని జీర్ణించుకోలేకే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తున్నారని విమర్శించారు.