Nampally Numaish : నుమాయిష్ లో ఈరోజు మహిళల సందడి
Nampally Numaish :నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్‌కు నేడు మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే 46 రోజుల్లో ఒక రోజు మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశం కల్పించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆశ్విన్ మార్గం తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఒక రోజు మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశాన్ని ఏర్పాటు చేసారు.
ఇందులో భాగంగా ఇవాళ నుమాయిష్‌కు కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. మహిళలతో పాటు 18 ఏండ్ల లోపు అబ్బాయిలకు అనుమతి ఉంటుంది. ఇక ఎగ్జిబిషన్‌లో ఇవాళ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ 46 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్లో దేశ, విదేశాలకు చెందిన 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఓపెన్ చేసే ఉంటుంది. ఈ సారి దాదాపుగా 25 లక్షలమంది వస్తారని అంచనావేస్తున్నారు ఎగ్జిబిషన్ సొసైటీ వారు. వీక్షకుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటర్ నెట్ కోసం బీఎస్ఎన్ఎల్ నుండి కూడా ఒప్పందం చేసుకున్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు ఈ నుమాయిష్ సాగనుంది.