KTR: సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. రెండు రోజుల కిందట ఈ అందమైన ప్రదేశం ఎక్కడ అంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న సందించిన విషయం తెలిసిందే..ఇక తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫొటోని షేర్ చేశారు మంత్రి కేటీఆర్. తాను స్టూడెంట్‌గా ఉన్న టైమ్‌లో నిజాం కళాశాలలో నడిపిన బైక్ ఉందని అది ఇంకా చెక్కు చెదరలేదని తెలిపారు. 29 ఏళ్లు గడిచినా ఆ బైక్ మంచి కండిషన్ లోనే ఉందని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ ఫొటోలో ఉన్నది తన బైకేనంటూ ఆయన సంబరపడిపోయారు. అంతేకాకుండా తన పాత బైక్ ను గుర్తు చేస్తూ కొన్ని జ్ఞాపకాలను యాది చేసుకుంటూ జాన్సన్ అనే వ్యక్తికి థ్యాంక్స్ చెప్పారు. 24 ఏళ్ల క్రితం కేటీఆర్ నుంచి తీసుకున్న ఈ బైక్ ను తాను ఇప్పటికీ వాడుతున్నానని జాన్సన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా గతంలో కేటీఆర్ తో కలిసి ఈ బైక్ నడిపిన రీతిలో ఇప్పుడు కూడా కేటీఆర్ తో కలిసి బైక్ పై తిరగాలని ఉందని జాన్సన్ తెలిపాడు. ఈ పోస్ట్ చూసిన వెంటనే కేటీఆర్ స్పందించారు. 1990లలో సుజుకీ బైక్ లలో ప్రత్యేకించి సుజుకి సమురాయ్ బైక్ పై కుర్రకారు తెగ ముచ్చట పడేవారు. ఆ క్రమంలో కేటీఆర్ కూడా ఆ బైక్ నే వాడారు. ఆ బైక్ పై హైదరాబాద్ రోడ్లపై నిజాం కాలేజీలో చదువుకున్న రోజులను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
That was my Bike in Nizam college😁 surprised it’s still functional after almost 29 years!!
Thanks Johnson for bringing back many memories https://t.co/CvEm4GUMPb
— KTR (@KTRTRS) November 5, 2022