Minister Talasani: అక్రమ కట్టడాలపై మంత్రి తలసాని సమీక్ష
Minister Talasani: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్ సర్య్కూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో కొద్ది మీటర్ల దూరంలో విద్యుత్ సరఫరా ఉందన్నారు. ఒకవేళ షార్ట్ సర్య్కూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని.. కానీ అలా జరగలేదని ఆయన వివరించారు. అంతకుముందు ప్రమాద స్థలిని పరీక్షించిన మంత్రి తలసాని పరిస్థితిపై ఆరాతీసారు. అక్రమ నిర్మాణంలవల్లే ఇంతపెద్ద ఘోర పరిస్థితి నెలకొందని అన్నారు.
అక్రమ నిర్మాణాలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం జరిగిన భవనం లాంటి బిల్డింగులు నగరంలో సుమారు 25 వేల వరకు ఉండొచ్చన్నారు. హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలను రాత్రి రాత్రికి తొలగించలేమన్నారు. ఈనెల 25న కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఇందులో హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించనున్నారు. ఇందుకు జిహెచ్ఎంసి అధికారులతో సమావేశం కానున్నారు. అనుమతి లేకుండా ఎన్ని భవనాలు నిర్మించారో వాటికీ నోటీసులిస్తారా లేక అక్రమ కట్టడమని నోటిస్ ఇవ్వకుండానే కూల్చివేయనున్నారా అనేది కమిటీలో తేలనుంది.