IPL SRH: ఐపీఎల్ నుంచి సన్ రైజర్స్ మరో సారి ఇంటి బాట పట్టింది. ఇది లాంఛనమే. తెలుగు ప్రజలు ప్రత్యేకించీ హైదరాబాద్ వాసులు సన్ రైజర్స్ ను ఓన్ చేసుకున్నారు. టైటిల్ దక్కకపోయినా కనీసం మంచి ఆట తీరుతో అయినా ఆకట్టుకోలేక పోయింది. మొత్తం టోర్నీలో సన్ రైజర్స్ మిగిలిన టీంల ముందు తేలిపోయింది. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవటం లో ఏ మాత్రం శ్రద్ద చూపలేదు. ప్రత్యర్ధి టీంల వ్యూహాలను అంచనా వేయటం లో విఫమలైంది. టీం ఆక్షన్ సమయం నుంచి మ్యాచ్ సమయం వరకు ఎక్కడా స్పష్టమైన ప్రణాళికలు కనిపించలేదు. ఫలితంగా ఏకైక తెలుగు టీంగా చెప్పకొనే సన్ రైజర్స్ తో ప్రతీ సారి నిరాశ తప్పటం లేదు. పేరుకు మాత్రమే సన్ రైజర్స్ అయినా నిజంగా వీళ్లు ఉదయించేది ఎప్పుడు.
తప్పని సరిగా గెలవాల్సన మ్యాచ్ లో సన్ రైజర్స్ చిత్తుగా ఓడిపోయింది. కనీస ఆట తీరు ప్రదర్శించలేకపోయింది. కొత్త టీంలు..యువ ఆటగాళ్లు అదరగొడుతుంటే సన్ రైజర్స్ టీం మాత్రం వచ్చామా..ఆడామా.. వెళ్లామా అన్నట్లుగా ప్రదర్శన ఉంది. మ్యాచ్ లో ఏ విభాగంలోనూ సన్ రైజర్స్ కనీస ఆట తీరు ప్రదర్శించలేదు. పేలవమైన బౌలింగ్, పస లేని ఫీల్డింగ్, లైన్ లేని బ్యాటింగ్ ప్రత్యర్ధి పార్టీలకు వరంగా మారింది. అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీల ప్రణాళికలను చేధించటంలో పూర్తిగా విఫమైంది. టీం కు సీనియర్లు మెంటార్స్ గా ఉన్నా ఫలితం కనిపించ లేదు. గ్రౌండ్ లో ప్రతీ సందర్భంలో నిర్లక్ష్యం కనిపించింది. ప్రతీ టీం సన్ రైజర్స్ పైన ఆధిక్యత ప్రదర్శించాయి.
ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ టోర్నీల్లో 2016లో ఒక్క సారి మాత్రమే సన్ రైజర్స్ టైటిల్ విజేతగా నిలిచింది. డేవిడ్ వార్నర్ నాయకత్వంలో నాడు ఫైనల్ లో బెంగళూరు పైన విజయం సాధించి ఐపీఎల్ కప్ అందుకుంది. ప్రతీ సీజన్ లో భారీ అంచనాలతో సన్ రైజర్స్ ఐపీఎల్ లో అడుగు పెట్టటం..నిరాశ మిగల్చటం పరిపాటిగా మారింది. ప్రస్తుత ఐపీఎల్ లీగ్ దశ ముగింపు స్థాయికి వచ్చింది. ఇప్పటికే గుజరాత్ ప్లే ఆఫ్ బెర్తు ఖాయమైంది. మిగిలిన మూడు బెర్తుల కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కత నైట్ రైడర్స్ పోటీ పడుతున్నాయి. సన్ రైజర్స్ ఈ టోర్నీలో 12 మ్యాచ్ లు ఆడగా, కేవలం 4 గెలిచింది.
సన్ రైజర్స్ వైఫల్యం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. జట్టులోని కీలక ఆటగాళ్లను నిలబెట్టుకోవటంలో ప్రాంఛైజీ విఫలమైంది. ఆక్షన్ సమయంలో జట్ట సమతూకం పాటించటంలో వ్యూహం లోపించింది. గత రెండు సీజన్లలో దారుణమైన ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అంచనాలన్నీ ఈ సీజన్ కు ముందే ఆవిరైపోయాయి. గతేడాది డిసెంబర్లో మినీ వేలంలో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయడంలోనూ విఫలమైన సన్ రైజర్స్ ఈ సీజన్ లో ఏ విధంగానూ ఇతర జట్లకు పోటీ ఇవ్వదన్న ఫీలింగ్ అందరిలోనూ తీసుకొచ్చేసింది. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మార్ క్రమ్ ను కెప్టెన్ గా తీసుకున్నా ప్రారంభ మ్యాచ్ లకు భువనేశ్వర్ కెప్టెన్ గా వ్యవహరించాల్సి వచ్చింది.
సన్ రైజర్స్ లో కీలక ఆటగాళ్లుగా ఉన్న డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ వంటి స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరిగా జట్టుకు దూరమయ్యారు. వారి స్ధానంలో తీసుకున్న వారు కూడా అంతంతమాత్రంగానే ఆట తీరు ప్రదర్శించారు. మార్ క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, హారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విదేశీ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ వీరిలో జట్టును ముందుండి వరుసగా మ్యాచ్ లు గెలిపించే స్థాయిలో తమ సత్తా ప్రదర్శించ లేకపోయారు. ఒకటి, రెండు మ్యాచ్ లు మినహా రాణించలేదు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ వంటి క్రికెటర్లు ఉన్నా వీరి నిలకడ లేమి తనం వైఫల్యంగా మారింది. ఇలా వరుస కారణాలతో అభిమానుల ఆశలు నీరుగార్చుతూ సన్ రైజర్స్ ఇంటి ముఖం పట్టింది.