బోణీ కొట్టిన ఆరెంజ్ ఆర్మీ..
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 బంతులు ఉండగానే 2 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ 75 పరుగులతో రాణించాడు.
మరో వైపు మిడిలార్డ్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి 36 పరుగులతో రాణించాడు. దీంతో ఈ సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ జట్టు తన మూడో మ్యాచ్‌లో ఎట్టకేలకు గెలుపు పట్టాలెక్కింది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైకి ఇది వరసగా నాలుగో ఓటమి.