దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ కుదేలయితే.. హైదరాబాద్లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. మరింత డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అంటూ.. హైదరాబాద్లో ఒకవైపే కనిపించేది డిమాండ్. గతేడాది లెక్కలు తీస్తే మాత్రం అందుకు డిఫరెన్స్ అనిపిస్తోంది.
Hyderabad: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ కుదేలయితే.. హైదరాబాద్లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. మరింత డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అంటూ.. హైదరాబాద్లో ఒకవైపే కనిపించేది డిమాండ్. గతేడాది లెక్కలు తీస్తే మాత్రం అందుకు డిఫరెన్స్ అనిపిస్తోంది. నగరానికి నాలుగు వైపులా ఫుల్ డిమాండ్ పెరిగింది. సిటీలోనే కాదు పరిసర ప్రాంతాల్లోనూ ఇదే రకమైన గిరాకీ కనిపిస్తోంది. సొంతఇళ్లతో పాటు అద్దెఇళ్ళ గిరాకీలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మహా నగరంలో సొంతఇళ్లతో పాటు హౌస్ రెంట్స్ హైక్ అవుతున్నాయి. పెరిగిన అద్దెకు అలవాటు పడిపోయారు సిటీ జనం. అయితే భవిష్యత్తులో ఈ హైక్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. బెంగళూరులో అయితే ఇప్పటికే బెంబేలెత్తించే లెవెల్లో రెంట్లున్నాయి. దాంతో పోలిస్తే మన దగ్గర కొంచం బెటర్ అంటున్నారు. దేశంలోని మిగిలిన మహా నగరాలతో పోలిస్తే ఇళ్ల రెంట్ల విషయంలో హైదరాబాద్ బెటర్ అంటున్నారు. కానీ ఇది సామాన్య మానవునికి గుదిబండగా మారుతుంది.
హైదరాబాద్ లో అద్దె ఇళ్ల భారం ఎక్కువైపోతోంది. సిటీలో ఒకచోట కాదు సిటీ నలుమూలల ఇదే పరిస్థితి కనపడుతుంది. అద్దె ఎక్కువుందని ఆఫీస్ కి కొంచం దూరాన అద్దెయిల్లు తీసుకుందామనుకున్నవారికి నగర శివార్లలోకూడా ఇంటి ఓనర్స్ అమాంతంగా ఒకే సరి ఇంటి అద్దెలను పెంచేశారు. ఐటీ సెక్టార్ చుట్టూ ఉండే రెసిడెన్షియల్ ఏరియాలలో అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక గతేడాది హైటెక్ సిటీలో థౌజండ్ స్వేర్ ఫీట్ ఇంటి అద్దె నెలకు 24 వేల రూపాయల ఉంటే ఇప్పుడు 26500 రూపాయలు అయింది. అంటే ఏడాదిలో అద్దె 12 శాతం పెరిగింది. ఇక గచ్చిబౌలిలో 23 వేల రూపాయల రెంట్ ఉంటే ఇప్పుడు 25500 రూపాయలు అయింది. కొండాపూర్లో 21000 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 24 వేల రూపాయలకు చేరుకుంది. మియాపూర్, కూకట్ పల్లి, నార్సింగి, మణికొండ, ఉప్పల్, ఎల్ బి నగర్, బాలాపూర్, జీడిమెట్ల, హయత్ నగర్, ఇలా నగరము చుట్టూ ఉన్న ఏరియాలలో ఇంటి అద్దెలు ఎక్కువగానే ఉన్నాయి. దాదాపుగా ఈ ఏరియాలన్ని సిటీకి కొంచం దూరంలో ఉన్న అద్దెలు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. వాటితోపాటు,కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మెయింటనెన్స్ బిల్లు ఇవన్నికలిసి మరో రెండు మూడు వేలు వెరసి నెలకు 25000 నుండి 30000 వెలవరకు ఒక ఇంటి అద్దెకు వెళుతుంది.
రెండేళ్ల కిందట కరోనా మహమ్మారి కారణంగా హైదరాబాద్ వెలవెలబోయింది. ఒకప్పుడు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వారితో కియాకిటలాడిన హైదరాబాద్ కరోనా మహమ్మారి దెబ్బకు గత రెండు సంవత్సరాల కిందట బోసి పోయింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో భాగ్యనగరం ఉద్యోగులతో సందడి చేస్తుంది. దీంతో హైదరాబాద్ లో ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఐటీ సంస్థల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం పని చేయడానికి సంస్థలు నిర్ణయించడంతో సొంత ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో హైదరాబాదు దాదాపు సగం పైగా ఖాళీ అయింది. గత రెండేళ్లుగా హైదరాబాద్ నగరంలో చాలా కాలనీలు టులెట్ బోర్డ్ లతో బోసిపోయి కనిపించాయి. వర్క్ ఫ్రం హోం కారణంగా ఉద్యోగులు సొంత ఊర్లకే పరిమితం కావడంతో అద్దెలకు ఉండే నాధుడే కరువయ్యారు. ఇప్పుడు ఆఫీస్ లకు రావాలని ఆదేశండడంతో నగరబాట పట్టారు ఇదే అదునుగా ఇంటి అద్దెబారం పెరిగిపోయింది. కరోనా ముందుతో పోలిస్తే 50% అద్దెలు పెరిగాయి. కరోనాతో ఉద్యోగులకు శాలరీలు తగ్గాయి..కొందరికి ఉపాధి పోయింది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న సామాన్యులకు ఇంటి అద్దెలు పెరగడంతో తప్పేదిలేక తప్పని పరిస్థితిలో చెల్లిస్తున్నారు.
అద్దె ఇళ్లకు గిరాకీ పెరుగుతున్న కారణంగా దేశంలో ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు వేగంగా పెరుగుతున్నాయి.గత మూడు నెలల కాలంలో ధరలు మరింత అధికంగా పెరిగాయని తాజా నివేదికలో తేలింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశంలోని ప్రధాన 13 నగరాల్లో అంతకుముందు కంటే సగటున 4.1 శాతం అద్దెలు పెరిగాయి. హైదరాబాద్ వంటి నగరంలో ఇంటి అద్దెలు హెచ్చు తగ్గులుగా మారుతుంటాయి. హైదరాబాద్లోనే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. స్థిరమైన ఉపాధి కల్పించే నగరంగా అగ్రస్థానంలో హైదరాబాద్ నిలిచిందంటే దాని వెనక కారణం కూడా ఉంది.. ఉపాధి.. ఉద్యోగపరంగా అందరినీ అక్కున చేర్చుకుంటుండడంతో భాగ్యనగరంలో సెటిల్ అయ్యేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అందులోభాగంగా ఇక్కడికి వచ్చి అద్దెఇళ్లలో ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.