ఓయూలో ఉద్రిక్తత.. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం
తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీని ఉస్మానియా యూనిర్సిటీకి రానివ్వకుండా ప్రయత్నిస్తుందని విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. క్యాంపస్‌లో నిరసన చేపట్టిన విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయబోయారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. యూనివర్సిటీకి భారీగా చేరుకున్న పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు.
వచ్చే నెల 6, 7 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. మే 6వ తేదీన వరంగల్ జిల్లాలో పర్యటించనున్న రాహుల్.. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోయే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం మరుసటి రోజు అంటే మే 7న హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో పార్టీ శ్రేణులతో రాహుల్ గాంధీ సమావేశం అయి పార్టీకి చెందిన విషయాలపై చర్చిస్తారు. అదే రోజు నిరుద్యోగుల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఉస్మానియా క్యాంపస్‌కు వెళ్లనున్నారు. కానీ దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు