Summer: నిప్పుల కుంపటిగా మారనున్న ఈ వేసవి
Summer: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అసాధరణంగా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు మొదలైయ్యాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. దీంతో గతేడాది మార్చి నెల ఆరంభంలో ఎండలు మొదలైతే … ఈసారి ఫిబ్రవరినుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా సాధారణం కన్నా మూడు, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి.
కొద్ది రోజుల్లో మొదలు కానున్న వేసవి కాలంలో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దింతో ప్రజలు బెంభేలెత్తిపోతున్నారు. మార్చి మొదట్లోనే ఇలా ఉంటె మే వరకు ఇంకెలా ఉండబోతుందో అని అంటున్నారు. ఈసారి మార్చి మొదటివారంలోనే ఎండల తీవ్రత అధికమైంది. రెండు రోజులుగా జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒంగోలులో బుధ, గురువారాల్లో 33డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా శుక్రవారం ఏకంగా 36 డిగ్రీలు దాటింది.
పగలు ఎండలు ఠారెత్తిస్తున్నా.. రాత్రి మాత్రం చల్లగానే ఉంటోంది. రంగారెడ్డిలో అత్యల్పంగా 12.6 డిగ్రీలు నమోదు కాగా.. వికారాబాద్‌లో 12.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో అత్యధికంగా 37 డిగ్రీలు నమోదు కాగా, నిజామాబాద్‌లో 36.9 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండలు మండిపోనుండటంతో ప్రజలు బయటకు వచ్చేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మార్చి మొదటివారంలోనే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే రెండునెలలు చాల కష్టం అంటున్నారు ప్రజలు.