గ్రేటర్ మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయువ్య పశ్చిమ దిశల నుంచి వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
Hyderabad: గ్రేటర్ మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయువ్య పశ్చిమ దిశల నుంచి వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 – 10 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో వేడిమిని తట్టుకోలేక అల్లాడుతున్నారు సిటీ జనం.
ముఖ్యంగా వేసవిలో మంచినీరే దివ్య ఔషధమని చెబుతున్నారు. వేడిమికి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుందని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ కు గురైతే ఓఆర్ఎస్ తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే సిటీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా వాతాహవరణం చల్లబడుతుంది అనుకునేలోపే భానుడు అలా పక్కకు వెళ్లి మళ్ళీ ఇలా వచ్చేసాడు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 38.0, కనిష్ఠం 27.9 డిగ్రీలు, గాలిలో తేమ 28 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 4 నాటికి కేరళకు రుతు పవనాలు వస్తాయని తాజా అంచనాలో భారత వాతావరణ శాఖ ఐఎండి వెల్లడించింది. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉండే అవకాశం ఉందని ఐఎండి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.