Bandi Sanjay: బండి సంజయ్ కుమార్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై నిన్న బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్ తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించేందుకు నిర్ణయం తీసుకుందని అంటున్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ డీజీపీని విచారణకు ఆదేశించింది. తాజాగా కవిత ఈడీ నోటీసుల అంశం మీద ‘కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా’ అంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.