తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ విద్యార్థులతో రాష్ట్ర గవర్నర్ చెలగాటమాడుతున్నట్లు విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటి మండిపడింది. ప్రభుత్వం పంపిన బిల్లులను వెంటనే ఆమోదించడం తప్ప ఇతర అలంకారాలు లేనటువంటి గవర్నర్ కావలనే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రజాస్వామ్య విరుద్దమైన చర్యలకు పాల్పడుతోందని, దీనికి నిరసనగా ఛలో రాజ్ భవన్‌కు పిలుపునిస్తున్నట్లు యూనివర్శిటీ ఐక్యకార్యాచరణ కమిటీ నేతలు పేర్కొన్నారు.
Telangana University: తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ విద్యార్థులతో రాష్ట్ర గవర్నర్ చెలగాటమాడుతున్నట్లు విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటి మండిపడింది. ప్రభుత్వం పంపిన బిల్లులను వెంటనే ఆమోదించడం తప్ప ఇతర అలంకారాలు లేనటువంటి గవర్నర్ కావలనే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రజాస్వామ్య విరుద్దమైన చర్యలకు పాల్పడుతోందని, దీనికి నిరసనగా ఛలో రాజ్ భవన్‌కు పిలుపునిస్తున్నట్లు యూనివర్శిటీ ఐక్యకార్యాచరణ కమిటీ నేతలు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ నియమించిన గవర్నర్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదేరకమైన అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్రగవర్నర్ కావాలనే తొక్కిపెడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల విద్యార్థుల ఐక్యకార్యాచరణ సమితి ప్రత్యక్ష చర్యలకు దిగాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల్లో పెండింగ్ పెట్టిన ఫైల్స్‌ను క్లియర్ చేయకుంటే విద్యార్థులు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తారని, కేంద్ర ప్రభుత్వానికి తమ తడాకా ఏంటో చూపుతామని హెచ్చరించారు