Sankranti Festival: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
Sankranti Festival: సంక్రాంతి పర్యదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసి 4233 ప్రత్యేక బస్సులను నడిపాలని నిర్ణయించింది. జనవరి 7 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సుల వివిధ రూట్లలో ప్రయాణం చేయనున్నాయి. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. మొత్తం 585 సర్వీస్‌లకు రిజర్వేషన్ సౌకర్యం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంకు 124, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నానికి 65 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని కూడా ఎండీ సజ్జనార్ అధికారులకు సూచించారు. సజ్జనార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది సంక్రాంతి సమయంలో పెద్ద మొత్తంలో ఆదాయం లభించింది. కాగా, ఈ ఏడాది కూడా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకర్షించేలా ఆర్టీసీని తీర్చిదిద్దాలని కూడా నిర్ణయించారు.