Telangana New Secretariat: ఫిబ్రవరి 17 న తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం ప్రారంభం..వేముల ప్రశాంత్ రెడ్డి
Telangana New Secretariat: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయంలో మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు చేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తరచూ సచివాలయ పనులు పరిశీలిస్తూ పురోగతిని తెలుసుకోవడం సహా వేగవంతానికి ఆదేశాలిస్తున్నారు. వీలైనంత త్వరగా పనులన్ని పూర్తి చేయాలని సూచిస్తున్నారు.
తరచూ సచివాలయం పనులగురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాకబు చేస్తూనే ఉన్నారు. వీలైతే మొత్తం భవనం లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరోఅంతస్థు, సాధారణ పరిపాలనాశాఖ కోసం మరో అంతస్థు సిద్ధం చేసి ప్రారంభిస్తే బాగుంటుందనే ఆలోచనలో అధికారులున్నట్లు సమాచారం. ఇక నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పనుల్లో ఇంకా వేగం పెంచాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను,అధికారులను ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి వారికి స్పష్టం చేశారు.
నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ముఖ్యమంత్రికేసీఆర్ ‘డా.బి.అర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరుపెట్టారు. ఈ భవనం ఒక రాజభవనం ల ఉండాలని ఇదివరకే సూచించారు. ఇక సంక్రాంతి పర్వదినాన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ నూతన సచివాలయాన్ని ఎప్పుడు ప్రారంభిస్తస్తున్నారో తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 17 న ఆయన చేతులమీదుగా ప్రారంభిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ తెలిపారు.