KTR Injured: మంత్రి కేటీఆర్ కాలికి గాయం, మూడు వారాల విశ్రాంతి
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గాయాల పాలయ్యారు. ఎడమకాలి చీలమండకు గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. డాక్టర్లు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోమన్నారని కూడా కేటీఆర్ వెల్లడించారు. దానితో పాటు నెటిజన్లను ఓ సలహా అడిగారు. ఈ విశ్రాంతి సమయంలో ఓటీటీలో తాను చూడడానికి మంచి సినిమాల కొన్నింటిని సూచించమని కోరారు.
Had a fall today & ended up tearing my ankle ligament. Been advised 3 weeks of rest 🙁
Any advise on binge worthy OTT shows? pic.twitter.com/sWat7eCkWX
— KTR (@KTRTRS) July 23, 2022
నెటిజన్ల సలహాలు
మంత్రి కోరిన వెంటనే నెటిజన్లు కొందరు స్పందించారు. వారికి తోచిన మంచి సినిమాలను కేటీఆర్‌కు సూచిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. రేపు కేటీఆర్ పుట్టినరోజు కావడంతో పనిలో పనిగా కేటీఆర్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేటీఆర్ కోరిన విధంగా కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లను సూచిస్తున్నారు. పీకీ బ్లైండర్స్, ది బాయ్స్, బెటర్ కాల్ సూల్, పంచాయత్ హిందీ వెబ్ సిరీస్‌లను ఎక్కువ మంది సూచించారు.
అభిమానుల ఆందోళన
పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు కేటీఆర్‌కు గాయం కావడంతో ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. ఈ నేపథ్యంలో తన జన్మదిన వేడుకలు జరపవద్దని టీఆర్ఎస్ శ్రేణులను కేటీఆర్ కోరారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేయాలని తన అభిమానులను కోరారు.
గెట్ వెల్ సూన్
మంత్రి హరీశ్‌రావు కూడా కేటీఆర్ గాయం విషయమై ట్విట్టర్ ద్వారా స్పందించారు. గెట్ వెల్ సూన్ రామ్, హేవ్ ఏ స్పీడీ రికవరీ అంటూ ట్వీట్ చేశారు.
Get well soon Ram…Have a speedy recovery! https://t.co/CfASAcAu9N
— Harish Rao Thanneeru (@trsharish) July 23, 2022
గాడ్సే డైరెక్టర్ ట్వీట్
గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి కేటీఆర్‌కు దర్శకుడు గోపీ గణేశ్ ఓ సలహా ఇచ్చాడు. తాను తెరకెక్కించిన గాడ్సే సినిమాను చూడమని సలహా ఇచ్చాడు. డైనమిక్ కేటీఆర్ సర్ అంటూ దర్శకుడు తన ట్వీట్ ప్రారంభించాడు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని తెలిపాడు. నెట్ఫిక్స్ ఓటీటీలో తాను దర్శకత్వం వహించిన గాడ్సే సినిమాను చూడమని కోరాడు. మనలాంటి యువత కోసమే ఈ సినిమా తీశానని గాడ్సే సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నానని గోపీ గణేశ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత మీరిచ్చే రివ్యూ కోసం ఎదురుచూస్తుంటా అని ట్వీట్ ముగించాడు.
Wishing you a speedy recovery Dynamic KTR sir. Pls do watch my film GODSE on @NetflixIndia. I made it for our youth and am hopeful you will like it. Will be waiting for your review sir . 🎬 @KTRTRS #KTRReview #KTR #SpeedyRecoveryKTR https://t.co/uppQ9aNKkK pic.twitter.com/YKuwLd09qZ
— Gopi Ganesh (@MeGopiganesh) July 23, 2022