CM KCR: తెలంగాణ ప్రభుత్వ హాస్టల్స్ మెస్ చార్జీలు పెంపు
Telangana Hostel Fees will be increased very soon
తెలంగాణ ప్రభుత్వ హాస్టల్స్ మెస్ చార్జీలు పెరగనున్నాయి. దాదాపుగా 25 శాతం చార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ ఉప సంఘం చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. గత కొంత కాలంగా మెస్ చార్జీలు పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్ధులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
ఒకటి నుంచి 7 తరగతి చదువుతున్న విద్యార్ధుల మెస్ చార్జీలు 950 నుంచి 1200 రూపాయలకు పెరగనున్నాయి. అదే విధంగా 8-10 తరగతి విద్యార్ధులకు ప్రస్తుతం ఉన్న 1100 రూపాయల నుంచి 1400 రూపాయలకి పెరగనున్నాయి. ఇంటర్ నుంచి పేజీ వరకు చదువుతున్న విద్యార్ధులకు ప్రస్తుతం ఇస్తున్న 1500 రూపాయల నుంచి 1875 రూపాయలకి చేరనుంది.
తెలంగాణ ప్రభుత్వ హాస్టల్స్‌లో విద్యార్థులకు అందుతున్న మెస్ చార్జీలు అస్సలు సరిపోవడం లేదనే విమర్శలు గత కొంత కాలంగా ఊపందుకున్నాయి. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన భోజనం విద్యార్ధులకు అందడం లేదని విద్యార్ధి సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్లు పెరిగాయి.
ఇటీవలే వైసీపీ ఎంపీ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్, గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని పోరాటానికి దిగారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీతాలను కేసీఆర్ ప్రభుత్వం పెంచుతోందని, అదే విధంగా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. మెస్ చార్జీలు పెంచాలని కోరుతూ తెలంగాణ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కృష్ణయ్య వినతిపత్రం అందజేశారు.