తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సంబంధించి దోస్త్ పేరుతో ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను అందిస్తూ వస్తున్నది. ప్రభుత్వ కళాశాలల్లో మంచి బోధనతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ వస్తున్నది.
Telangana High Court: తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సంబంధించి దోస్త్ పేరుతో ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను అందిస్తూ వస్తున్నది. ప్రభుత్వ కళాశాలల్లో మంచి బోధనతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ వస్తున్నది. గత కొంతకాలంగా ప్రతి ఏడాది దోస్త్ పేరుతో అడ్మిషన్లు ఇస్తున్నది. అయితే, దీనిపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. డిగ్రీ ప్రవేశాలపై హైకోర్టును ఆశ్రయించారు. దోస్త్ ఆన్లైన్ ప్రవేశాలను సవాల్ చేస్తూ 40 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. గత ఐదేళ్లుగా 50 ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యలు హైకోర్టును ఆశ్రయిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు మరో 40 కాలేజీల యాజమాన్యం కోర్టు మెట్లెక్కింది.
2016-17 విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యామండలి ఒకేవిధమైన నోటిఫికేషన్లు ఇస్తూ వస్తున్నదని, ఈ నోటిఫికేషన్ల కారణంగా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు నష్టపోతున్నాయని, ప్రతి ఏడాది హైకోర్టు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులతోనే ప్రవేశాలు చేపడుతున్నట్టు యాజమాన్యాలు పేర్కొన్నాయి. ప్రతి ఏడాది తాము అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే ఉన్నామని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలికలు లేవని హైకోర్టుకు యాజమాన్యం తెలియజేసింది. 2023-24 లోనూ దోస్త్ తో సంబంధం లేకుండా ప్రవేశాలను అనుమతించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్లు వేసిన కాలేజీల ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. అదేవిధంగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఉన్నత విద్యామండలికి విశ్వవిద్యాలయం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పెండింగులో ఉన్న పిటిషన్ల జాబితా ఇవ్వాలని కూడా ఉన్నత విద్యా మండలికి ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పిటిషన్లపై తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేసింది.