Telangana Govt Petition on Governor in Supreme Court: మార్చి 20న విచారణ
Telangana Govt Petition on Governor in Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపిన బిల్లులు రాజ్‌భవన్‌లోనే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించాలని, బిల్లులు చట్టబద్దమైతేనే ప్రజలకు ఉపయోగపడుతుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోర్లులో ప్రస్తావించారు. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావించగా, ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈనెల 20వ తేదీన పిటిషన్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.
అయితే, పెండింగ్‌లో ఉన్న బిల్లులపై తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, తన అనుమానాలను నివృత్తి చేయాలని గవర్నర్ ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఎరియా బిల్ 2022, తెలంగాణ మునిసిపల్ లాస్ బిల్ 2022, తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ బిల్ 2022, యూనివర్శిటి కామన్ రిక్రూట్మెంట్ బిల్ 2022, తెలంగాణ మోటార్ వెహికిల్ ట్యాక్సేషన్ బిల్ 2022 వంటి మొత్తం 10 బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు పిటిషన్లో పేర్కొన్నారు.