Telangana Governor on CM kCR Health: కేసీఆర్ త్వరగా కోలుకోవాలి
Telangana Governor on CM kCR Health: సీఎం కేసీఆర్ ఆదివారం రోజున అశ్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్న సీఎం కేసీఆర్‌ను గచ్చిబౌలిలో ఉన్న ఏజీఎం ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. సుమారు నాలుగు గంటలపాటు వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాత సీఎం కేసీఆర్‌ను డిశ్చార్జ్ చేశారు. కేసీఆర్ అల్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అల్సర్ మినహా ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేవని, వైద్యులు పేర్కొన్నారు. కాగా, సీఎం అశ్వస్థతపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు.
ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. సీఎం పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. సీఎం త్వరగా కోలుకోవాలని గవర్నర్ తెలియజేశారు. ఆరోగ్య పరీక్షలకు సీఎం సాధారణంగా యశోదా లేదంటే నిమ్స్ ఆసుపత్రికి వెళ్తుంటారు. కానీ, ఏజీఎం ఆసుపత్రికి ఎందుకు రావాల్సి వచ్చిందనే దానిపై ఆసక్తి నెలకొన్నది. ఆదివారం రోజున సీఎం సతీమణి శోభ అశ్వస్థతకు గురికావడంతో ఆమెను ఎజీఎంకు తరలించారు. అక్కడే కేసీఆర్ కూడా స్వల్ప అశ్వస్థతకు గురికావడంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ నుండి నేరుగా కవిత ఎజీఎం ఆసుపత్రికి చేరుకొని తల్లి శోభ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు.