Telangana Government Crucial Petition on MLA Bribing Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తుపై స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హోమ్ ముఖ్య కార్యదర్శి తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందన్న ప్రభుత్వం 24 గంటలు గడవక ముందే దర్యాప్తు ఏకపక్షమని బీజీపీ అనడం నిరాధారమని పేర్కొంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజీపీ నిరాధార ఆరోపణలతో పిటిషన్ వేసిందనీ పంచనామాలో మధ్యవర్తులు సంతకం వద్ద తేదీలు వేయడంలో పొరపాటు జరిగిందని పేర్కొంది. ఈ విచారణలో పంచనామాను ప్రాధాన్యంగా తీసుకోవాల్సిన అసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. మరో పక్క ఇదే కేసులో దర్యాప్తుపై హైకోర్టులో నిందితులు పిటిషన్ వేశారు. హైకోర్టును రామచంద్రభారతి, కోరె నందు కుమార్, సింహయాజి ఆశ్రయించారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని సిట్ కు అప్పగించాలని, నలుగురు ఎమ్మెల్యేలను ఇప్పటి వరకు విచారించలేదనీ వారు పిటిషన్లో పేర్కొన్నారు. సీఎం మార్గదర్శకంలో జరుగుతున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని టీఆరెఎస్, బీజీపీ మధ్య గొడవలో బాధితులమయ్యామని పిటిషన్లో పేర్కొన్నారు. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రమాదం కూడా ఉందని వారు అభిప్రయపడ్డారు.