Telangana Foxcon : ఐ అంటే ఇండియా, టి అంటే తైవాన్.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Foxcon :ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ తో ఇవాళ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు ఐ అంటే ఇండియా… టి అంటే తైవాన్ అని అన్నారు. సాఫ్ట్వేర్ కు ఇండియా పవర్ హౌస్ అని మరో పక్క తైవాన్ దేశం హార్డ్వేర్ లో సంచలనాలు సృష్టిస్తుందన్నారు. ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వవచ్చని అన్నారు. దేశంలో చూసిన నగరాల్లో హైదరాబాద్ నగరం చాలా బాగుంది అని యంగ్ లు అన్నారు, ధన్యవాదాలు అని పేర్కొన్న ఆయన తైవాన్ దేశం అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. చైనా, శాంజైన్ లో చేసినట్టు చేసినట్టు భారత దేశంలో హైదరబాద్ ను శాంజైన్ ను చేద్దామన్న ఆయన తెలంగాణ కెసిఆర్ నాయకత్వంలో చాలా బాగా ముందుకు సాగుతోందన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నందుకు ఫాక్స్ కామ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం చాలా స్పీడ్ అని టి వర్క్స్ ను అత్యంత అందుబాటులోకి వేగంగా తీసుకొచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కేసీఅర్ చూపించిన వీడియో నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందన్న ఆయన టి వర్క్స్ కు ఇండస్ట్రీ లెవల్ SNT లైన్ ను డొనేట్ చేస్తామన్నారు