తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు కావొస్తున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగినట్టుగా ఏర్పాట్లను చేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వం ఈ ఉత్సవాలకు సంబంధించి ముఖ్య ఆదేశాలు జారీ చేసింది.
Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు కావొస్తున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగినట్టుగా ఏర్పాట్లను చేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వం ఈ ఉత్సవాలకు సంబంధించి ముఖ్య ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించింది. జూన్ 2 నుంచి 21 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ను నేడు విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 2న సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం ఉత్సవాలను ప్రారంభిస్తారు. తొలిరోజు నూతన సచివాలయంలో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాలకు చెందిన మంత్రులు, అధికారులు హాజరవుతారు.
జూన్ 3న రైతు దినోత్సవంగా, జూన్ 4న సురక్షా దినోత్సవం, జూన్ 5 తెలంగాణ విద్యుత్ దినోత్సవం, జూన్ 6 పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, జూన్ 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూర చెరువుల పండుగ, 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లె ప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న గిరిజనోత్సవం, 18న మంచినీళ్ల పండుగ, 19న హరితోత్సవం, 20న తెలంగాణ విద్యా దినోత్సవం, 21న ఆధ్యాత్మక దినోత్సవం, 22న తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు జరగనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.